వాట్సప్ చాటింగ్ హ్యాక్ : సొల్యూషన్ ఇదే

వాట్సప్ చాటింగ్ హ్యాక్ : సొల్యూషన్ ఇదే

వాట్సప్ లో చేసే చాటింగ్ ను హ్యాక్ చేస్తున్నారు ఇజ్రాయిల్ కు చెందిన హ్యాకర్లు. దీంతో పర్సనల్ చాటింగ్ విషయాలు.. యూజర్ల జ్యోక్యం లేకుండా హ్యాకర్లకు చేరుతుంది. ఇందుకు ‘ఇన్ యాప్ వాయిస్’ ను తయారు చేశారు. దీంతో సదరు యూజర్ కు కాల్ వెళ్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసినా చేయక పోయినా.. యూజర్ల డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

ఇజ్రయిల్ కు చెందిన NSO గ్రూప్ ‘అడ్వాన్స్‌డ్ సైబర్ యాక్టర్’ పేరుతో స్పైవేర్ ను తయారుచేసినట్టు తెలిసింది. దీంతో వాట్సప్ యూజర్ల చాటింగ్ ను హ్యాక్ అవుతున్నట్లు గుర్తించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వాట్సప్ టీమ్ సమస్యను సాల్వ్ చేసింది. ఇందుకు సొల్యూషన్ గా.. వాట్సప్ పాత వర్షన్ ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సమాచారం అందించింది. ఆండ్రాయిడ్, IOS యూజర్లకుగానూ అప్ డేట్ వర్షన్ రిలీజ్ చేశారు.