గాజా వైమానిక దాడిలో హమాస్ చీఫ్ మృతి..3నెలల తర్వాత ఇజ్రాయెల్ ప్రకటన..

గాజా వైమానిక దాడిలో హమాస్ చీఫ్ మృతి..3నెలల తర్వాత ఇజ్రాయెల్ ప్రకటన..

మూడు నెలల క్రితం గాజాలో జరిగిన వైమానిక దాడిలో హమాస్ చీఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) తెలిపింది. గురువారం ( అక్టోబర్ 3,2024 ) ఓ ప్రకటనలో తెలిపింది ఐడీఎఫ్. నార్త్ గాజాలోని అండర్ గ్రౌండ్ గాజాపై జరిగిన దాడిలో గాజా ప్రధాని రౌహీ ముష్తాహాతో పాటు మరో ఇద్దరు హమాస్ కమాండర్లు సమేహ్ సిరాజ్, సమేహ్ ఔదేహ్ మరణించారని పేర్కొంది ఐడీఎఫ్.

Also Read :- భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

నార్త్ గాజాలో అండర్ గ్రౌండ్ కాంపౌండ్ లో ఉగ్రవాదులు దాక్కున్నప్పుడు IAF ఫైటర్ జెట్‌లు దాడి చేసి వారిని అంతమొందించాయని తెలిపింది. అదే కాంపౌండ్ హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేసిందని... సీనియర్ ఆపరేటివ్‌లు దాని లోపల ఎక్కువ కాలం ఉండేలా చేసిందని తెలిపింది. అక్టోబరు 7న జరిగిన మారణకాండకు కారణమైన ఉగ్రవాదులను వెతికే పనిలో ఐడీఎఫ్ ఉందని.. ఎక్స్ లో ఓ ట్వీట్ ద్వారా తెలిపింది ఐడీఎఫ్.

 

సీనియర్ అధికారుల మరణాలను హమాస్  ప్రకటించట్లేదని... హమాస్ తన నష్టాలను దాచిపెడుతోందని ఐడీఎఫ్ చెబుతోంది, తన తీవ్రవాద దళాలు నైతిక స్థైర్యాన్ని కోల్పోకుండా చూసుకునేందుకే ఇలా చేస్తోందని తెలిపింది. "హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేసి, సీనియర్ ఆపరేటివ్‌లు ఎక్కువ కాలం అండర్ గ్రౌండ్ కాంపౌండ్ లో ఉండేలా చేసిందని తెలిపింది ఐడీఎఫ్.