గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ మద్దతుదారులైన హిజ్బుల్లా టెర్రరిస్ట్ సంస్థలో ఇజ్రాయిల్ ఏరివేత ప్రారంభించింది. దీంతో ఇజ్బుల్లా సంస్థకు కార్యకాలాపాలు జరిగే చోట బాంబుల వర్షం కురిపిస్తోంది. మెయిన్ మెయిన్ లీడర్లను టార్గెట్ చేసి మరీ ఇజ్రాయిల్ చంపేస్తోంది. లెబనాన్ రాజధానిలో (సెప్టెంబర్ 28) శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో హిజ్బు్ల్లా కమాండర్ నబిల్ క్వాక్ చనిపోయినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
ALSO READ | టెర్రరిజాన్ని ఎగదోస్తే శిక్ష తప్పదు: పాకిస్తాన్పై జైశంకర్ ఫైర్
నబిల్ క్వాక్ హిజ్బుల్లా గ్రూప్ లో సినియర్ నాయకుడు, ప్రివెంటివ్ సెక్యురిటీవ్ యూనిట్ కమాండర్. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను శుక్రవారం జరిగిన వైమానికి దాడుల్లో హతమార్చారు. తర్వాత రోజే హిజ్బుల్లాలో మరో కీలక వ్యక్తిని చంపేశారు. ఇజ్రాయెల్ సైన్యం అతని మరణానాన్ని శనివారం నిర్థారించింది.
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శనివారం రాత్రి బీరుట్‌లోని దహియే ప్రాంతంలో చేసిన అటాక్ లో నబిల్ క్వాక్ మరణించాడు. ఆ ప్రాంతం హిజ్బుల్లాలకు బలమైన స్థావరంగా ఉంది. నబిల్ 1980లో ఆ సంస్థలో చేరాడు. డిప్యూటీ హెడ్‌గా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో దక్షిణ లెబనాన్ ప్రాంతానికి అధిపతిగా, అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్‌గా కూడా ఆయన పనిచేశాడు.