యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయిల్.. ఇరాన్‌పై క్షిపణి దాడి

ఇరాన్ ఇజ్రాయిల్‍పై చేసిన దాడికి ప్రతీకార చర్య ప్రారంభించింది. దీంతో ఇరాన్ లో యుద్ధవాతారణం నెలకొంది. ఇజ్రాయిల్ శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు ఇరాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ఓ మీడియా సంస్థ ప్రకటించింది. ఇరాన్ లోని ఇస్ఫాహాన్ విమానాశ్రయంలో పెద్ద పేలుడు సంభవించిందని ఆ దాడి ఇజ్రాయిల్ చేసినట్లు భావిస్తున్నారు. 

ఏప్రిల్ 19న ఉదయం టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్ విమానాశ్రయాలతో సహా అనేక ప్రాంతాలలో ఇరాన్ విమానాలను నిలిపివేసింది. పశ్చిమ ఇరాన్ చుట్టూ అనేక విమానాలు దారి మళ్లించబడ్డాయి. ఇరాన్ దేశానికి చెందిన యురేనియం ఖనిజనిక్షేపాలు, నటాన్జ్‌ వంటి అణు కేంద్రాలు ఇస్ఫాహాన్ ప్రావిన్స్‌లోనే ఉన్నాయి. అందుకే ఇజ్రాయిల్ ఇస్ఫాహాన్ లోనే మొదటి అటాక్ చేసినట్లు తెలుస్తోంది. సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయిల్ దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.