తొలి టీకా వేయించుకున్న ప్రధాని

తొలి టీకా వేయించుకున్న ప్రధాని

ఇజ్రాయిల్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.  ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కరోనా టీకా వేయించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీకాపై కొన్ని వర్గాల్లో భయం ఉండడంతో తానే ముందుగా వ్యాక్సిన్ వేయించుకొని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని పిలుపిచ్చారు నెతన్యాహూ. ఒక వ్యక్తి తీసుకునే చిన్న ఇంజక్షన్ ఎంతో మంది ఆరోగ్యాన్ని రక్షిస్తుందన్నారు.

ఇజ్రాయిల్ లో ఇప్పటివరకు 3 లక్షల 72 వేల కరోనా కేసులు రికార్డయ్యాయి. సుమారు 3 వేల 700 మంది చనిపోయారు. ఇజ్రాయిల్ కు ఫైజర్ – బయో ఎన్ టెక్ రూపొందించిన 40 లక్షల కరోనా టీకా డోసులు వచ్చాయి. వీటితో వ్యాక్సినేషన్ ప్రారంభించారు.

ఆమెకు 15.. అతనికి 16.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని సూసైడ్