Israeli strikes : గాజాలో స్కూల్‌పై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్.. 100 మంది మృతి

Israeli strikes : గాజాలో స్కూల్‌పై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్.. 100 మంది మృతి

ఇజ్రాయిల్ శనివారం ప్రార్థన (ఫజ్ర్) టైంలో గాజాలోని ఓ స్కూల్ టార్గెట్‌గా చేసుకొని వైమానిక దాడులు చేసింది. దరాజ్ జిల్లాలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. పౌరులను, స్కూల్స్ ను టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తుందని హామాస్ ఆరోపిస్తుంది. 

అల్-తబాయీన్ పాఠశాలలో ఉన్న హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ స్కూల్ ను హమాస్ ఉగ్రవాదులు, కమాండర్లకు స్థావరంగా ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తుంది. కేవలం హమాస్ ను లక్ష్యంగా చేసుకొనే పౌరులకు హాని కలగకుండా దాడి చేశామని ఇజ్రాయిల్ దేశం సమర్థించుకుంటుంది.