బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 31కి పెరిగిందని లెబనాన్ హెల్త్మినిస్టర్ ఫిరస్ అబియాద్ తెలిపారు. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్టు శనివారం ప్రకటించారు.
బీరుట్‌పై శుక్రవారం ఇజ్రాయెల్క్షిపణి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మరణించినవారిలో ఎలైట్ రద్వాన్ దళాలకు నేతృత్వం వహించిన హెజ్బొల్లా కమాండర్ ఇబ్రహీం అకీల్ ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే టెర్రరిస్ట్ గ్రూపులోని పలువురు సభ్యులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు సిరియా జాతీయులు కూడా ఉన్నారని అబియాద్ తెలిపారు. ఇజ్రాయెల్ మిలిటరీ దాడిలో అకీల్ సహా మొత్తం 11 మంది హెజ్బొల్లా కార్యకర్తలు మరణించారని పేర్కొన్నారు.