గాజాపై ఇజ్రాయెల్ దాడులు .. 20 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు .. 20 మంది మృతి

గాజా: పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్​లో 20 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారు. దాడుల్లో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. గాజాలో షెల్టర్​హోమ్​గా మార్చిన స్కూల్​పై సోమవారం ఇజ్రాయెల్ ఫైటర్​జెట్లు బాంబులు వేశాయని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

హమాస్​పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన నెల రోజుల తర్వాత నుంచి ఈ స్కూల్ నిరాశ్రయులకు షెల్టర్​హోమ్​గా ఉంటున్నదని వారు తెలిపారు. అలాగే నుసైరత్ ​ప్రాంతంలో ఆదివారం రాత్రి కూడా బాంబు దాడులు జరిగాయని ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారని చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను నుసైరత్‌‌లోని అల్- అవ్​దా ఆసుపత్రి, డీర్ అల్ బలాహ్‌‌లోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి తరలించారు.