ఇస్రో మరో ప్రయోగం.. రేపు నింగిలోకి PSLV C-54

భారత అంతరిక్ష  పరిశోధన సంస్థ  మరో ప్రయాగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా  శ్రీహరికోటలోని  సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-54  రాకెట్ ప్రయోగం  కౌంట్ డౌన్ ప్రారంభించింది. దాదాపు 25 గంటలకు పైగా  కౌంట్ డౌన్ ప్రక్రియ జరగనుంది. రేపు ఉదయం 11 గంటల 56 నిమిషాలకు శాస్త్రవేత్తలు  PSLV C-54 రాకెట్ ను నింగిలోకి  పంపనున్నారు . 



షార్ మొదటి ప్రయోగ  వేదిక నుంచి  PSLV C-54 రాకెట్ ను ప్రయోగిస్తున్నారు. దీని  ద్వారా భారత్ కు  చెందిన 960  కిలోల ఓషన్ శాట్ -3  ఉపగ్రహంతో పాటు  మరో 8 శాటిలైట్లను రోదసీలోకి పంపనున్నారు. భారత్,  భూటాన్ కలిసి  రూపొందించిన భూటాన్ శాట్,  పిక్సెల్ సంస్థ  తయారు చేసిన  ఆనంద్ శాట్, ధ్రువ స్పేస్ సంస్థ రూపొందించిన  రెండు తైబోల్డ్  శాట్ లు, అమెరికాకు  చెందిన స్పేస్ ఫ్లైట్  సంస్థకు చెందిన  నాలుగు అస్ట్రోకాస్ట్  ఉపగ్రహాలను  PSLV C-54 రాకెట్  నింగిలోకి తీసుకెళ్లనుంది.