2023 ఆగస్టు 23 ఓ భారత దేశ ప్రజలు మరిచిపోలేని రోజు.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ చరిత్రకెక్కిన రోజు. జాబిలి ఉపరితల అన్వేషణలో ఇస్రో అద్భుత విజయం సాధించిన రోజు.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపిన మరుక్షణమే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.. దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చాటిన ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని దేశ ప్రజలు ముక్తం కంఠంతో కొనియాడారు. ఈ అరుదైన ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు దేశం గర్వించదగ్గ విజయం అందించిన ఇస్రో వర్గాలు సైతం సంబరాల్లో మునిగితేలాయి. చంద్రయాన్ 3 సక్సెస్ ను డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు. ఇస్రో చైర్మన్ సోమ్నాథ్తో సహా శాస్ర్తవేత్తలు, అధికారులు, సిబ్బంది ఉత్సహభరితమైన క్షణాలను గడిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లంతా ఇస్ర్తో శాస్త్రవేత్తల టీమ్ కృషి, అంకితభావాన్ని ప్రశంసలతో ముంచెత్తితున్నారు.
చంద్రయాన్ 3 సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మిషన్ భారత దేశానికి చారిత్రక క్షణం.. భవిష్యత్ తరాల శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు స్పూర్తి నిస్తుందని’’ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్ నాథ్ అన్నారు. చంద్రయాన్ 3 మిషన్ దేశం చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాల్లో అతిపెద్ద విజయం.. అంతరిక్ష పరిశోధనలో పెరుగుతున్న ఇండియా సామర్థ్యానికి ఇది నిదర్శనం.. ఇది భారతీయులందరికి గర్వకారణం అని అన్నారు.
@isro చైర్మన్ సోమనాథ్ తో పాటూ శాస్త్రవేత్తల సంబరాలు..
— HEMA (@Hema_Journo) August 23, 2023
Yes its celebration time. pic.twitter.com/lTKcsSDgf5