ఆదిత్య ఎల్ 1 కౌంట్ డౌన్ : రెడీ టూ లాంఛ్

సూర్యుడిపై  పరిశోధనలకు  సిద్ధమవుతోన్న  ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి సిద్దమయ్యింది.  ఈ ప్రయోగానికి   ఇస్రో అధికారులు  రిహార్సల్స్ కూడా  పూర్తి చేశారు.  PSLV-C57 ఆదిత్య L1 మిషన్  ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయని... లాంచ్ రిహార్సల్ - వెహికల్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది.  ఆదిత్య-ఎల్1 మిషన్ సూర్యుని అధ్యయనం చేసే లక్ష్యంతో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్.

ఆదిత్య ఎల్ 1 మిషన్ ను  2023, సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు.. ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుంచి  ప్రయోగించనుంది  ఇస్రో.  పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు.

ALSO READ :పలు రైళ్లను కుదించిన రైల్వే శాఖ: వివరాలు ఇవే...

 సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి ఆదిత్య L1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వార గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది.