భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. రీయూసబుల్ లాంచ్ వెహికల్ (RLV) టెక్నాలజీ వినియోగంలో ప్రధాన మైలురాయిని చేరుకుంది.కర్ణాటకలోని చిత్రదుర్గ్ జిల్లాలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో పుష్పక్ అని పిలువబడే రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV-2) ల్యాండింగ్ ప్రయోగాన్ని శుక్రవారం (మార్చి22) విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది.ఈ సిరీస్ లోని రెండో ప్రయోగం ఇది. దీని ద్వారా ఆఫ్ నామినల్ ప్రారంభ పరిస్థితుల నుంచి RLV స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
గతేడాది (2023) RLV-LEX-1 మిషన్ ను విజయవంతంగా నిర్వహించింది ఇస్రో. అయితే RLV-LEX-1 లో వాహనం రన్ వేపై స్వయంగా ల్యాండింగ్ కు ముందు క్రాస్ రేంజ్, డౌన్ రేంజ్ వంటి ప్రక్రియలను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్ని ప్రకటించింది.
పుష్పక్ అని పిలువబడే ఈ రెక్కల వెహికల్ ని భారత వైమానికదళం హెలికాప్టర్ చినూక్ ద్వారా రన్ వే నుంచి 4 కి.మీ. దూరంలో, 4.5 కి.మీల ఎత్తు నుంచి కిందికి విడుదల చేశారు. విడుదలైన తర్వాత పుష్పక్ తనంతట తానే రన్ వే వద్దకు చేరుకుంది. అవసరమైన క్రాస్ రేంజ్ ని సరిచేసుకుంది. ఆ తర్వాత ఖచ్చితంగా రన్ వేపై ల్యాండ్ అయింది. దాని బ్రేక్ పారాచూట్ , ల్యాండింగ్ గేర్ బ్రేక్ లు , నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సహాయంతో ఆగిపోయింది.
ఈ మిషన్.. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే RLV విధానం, హైస్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను విజయవంతంగా ఫాలో అయింది. RLV-LEX-02 తో ఇస్రో నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్స్, ల్యాండిగ్ గేర్ వంటి రంగాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించింది. ఇవి స్పేస్ రిటర్నింగ్ వాహనం హైస్పీడ్ స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ నిర్వహించడానికి అవసరమైన కీలక వ్యవస్థలు అని ఇస్రోతెలిపింది.
Utilising the #IAF Chinook helicopter for its airlift and subsequent positioning at a predefined altitude and location, @isro successfully demonstrated the autonomous landing capability of the Reusable Launch Vehicle (RLV) 'PUSHPAK' as part of its RLV-LEX 2 mission.
— Indian Air Force (@IAF_MCC) March 22, 2024
Airlifted to… pic.twitter.com/FCTGHk51wO