చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైన రోజుల వ్యవధిలోనే ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈసారి సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 రాకెట్‌ను పంపనుంది. సెప్టెంబర్ 2న దీన్ని ప్రయోగించనున్నారు. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే కానుండడం విశేషం.
ఇప్పటికే బెంగళూరులోని UR రావు సాటిలైట్ సెంటర్లో సిద్ధం చేసిన ఆదిత్య -L1 ఉపగ్రహాన్ని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ప్రత్యేక కంటైనర్‌లో శ్రీహరి కోట స్పేస్ సెంటర్కు తరలించారు. ఈ ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV - C57) రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ అంతరిక్ష నౌకను భూమి నుంచి1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లాగ్రాంజ్ పాయింట్1 (L1) చుట్టూ ఒక హాలో కక్ష్యలో ప్రవేశపెట్టనుంది ఇస్రో.
L 1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉంచబడిన ఉపగ్రహం.. ఎటువంటి ఆటంకం లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశోస్తుందని ఇస్రో పేర్కొంది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావం గమనించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుందని ఇస్రో తెలిపింది.
PSLV-C57/Aditya-L1 Mission:
— ISRO (@isro) August 14, 2023
Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is getting ready for the launch.
The satellite realised at the U R Rao Satellite Centre (URSC), Bengaluru has arrived at SDSC-SHAR, Sriharikota.
More pics… pic.twitter.com/JSJiOBSHp1
ఆదిత్య -L1 అంతరిక్ష నౌకలో మొత్తం ఏడు పే లోడ్ ఉంటాయని ఇస్రో పేర్కొంది. విద్యుదయాస్కాంత, కణ, మాగ్నెటిక్ ఫీల్డ్ఓ డిటెక్టర్ల ద్వారా ఫొటోస్పియర్, క్రోమో స్పియర్, సూర్యుని ఉపరితలం బయటి పొర( కరోనా)లను పరిశీలించనుంది.
#ISRO will launch #AdityaL1 mission in September to study Sun
— Kadak (@kadak_chai_) August 26, 2023
Chandrayaan 3 : #ShivShakti point
Aditya L1 point: Bal Hanuman point ✊? pic.twitter.com/77DsBIt8i3