సూర్యునిపై అధ్యయనం కోసం ఇస్రో సిద్ధమవుతోంది. సెప్టెంబర్లో తొలి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇస్రో సోమవారం వెల్లడించింది. బెంగళూరులోని UR రావు సాటిలైట్ సెంటర్లో సిద్ధం చేసిన ఆదిత్య -L1 ఉపగ్రహాన్ని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ప్రత్యేక కంటైనర్ లో శ్రీహరి కోట స్పేస్ సెంటర్కు తరలించారు. ఈ ఉపగ్రహాన్ని PSLV - C57 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.
ఆదిత్య -L1 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. అంతరిక్ష నౌకను భూమి నుంచి1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లాగ్రాంజ్ పాయింట్1 (L1) చుట్టూ ఒక హాలో కక్ష్యలో ఉంచాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఎల్ 1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉంచబడిన ఉపగ్రహం.. ఎటువంటి ఆటంకం లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశోస్తుందని ఇస్రో పేర్కొంది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావం గమనించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుందని ఇస్రో తెలిపింది.
ఆదిత్య -L1 అంతరిక్ష నౌకలో మొత్తం ఏడు పే లోడ్ ఉంటాయని ఇస్రో పేర్కొంది. విద్యుదయాస్కాంత, కణ, మాగ్నెటిక్ ఫీల్డ్ఓ డిటెక్టర్ల ద్వారా ఫొటోస్పియర్, క్రోమో స్పియర్, సూర్యుని ఉపరితలం బయటి పొర( కరోనా)లను పరిశీలించనుంది.
PSLV-C57/Aditya-L1 Mission:
— ISRO (@isro) August 14, 2023
Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is getting ready for the launch.
The satellite realised at the U R Rao Satellite Centre (URSC), Bengaluru has arrived at SDSC-SHAR, Sriharikota.
More pics… pic.twitter.com/JSJiOBSHp1