- షార్ నుంచి ఉదయం 10.24 గంటలకు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ51
సూళ్లూరుపేట: అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రంగం సిద్ధంచేసింది. ఈ నెల 28వ తేదీన ఉదయం 10.24 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ51తో వాణిజ్యరంగంలో తొలి అడుగు వేయనుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్ ప్రయోగం జరనుంది. చరిత్రలో ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న ఇస్రో కొంత కాలం క్రితం ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అంతరిక్ష ప్రయోగం చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని ఏర్పాట్లతో ఈనెల28న ప్రయోగం జరపనుంది.
దేశంలోని ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. మొత్తం 19 ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–1 ప్రధాన ఉపగ్రహం కాగా అమెరికాకు చెందిన స్పేస్ బీస్ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్–1 నానో కాంటాక్ట్–2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్ పేరుతో మూడు యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీష్ ధవన్ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. కాగా పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేసి సిద్ధంచేశారు. ప్రయోగ బాధ్యతలను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్)కు అప్పగించనున్నారు. 27వ తేదీన రేపు శనివారం ఉదయం 9.24 గంటలకు కౌంట్‌డౌన్ మొదలవుతుంది.
ఇవి కూడా చదవండి
పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు
కోర్ట్ ఆదేశాలతో మీడియా బులిటెన్ రిలీజ్..ఇవాళ రాష్ట్రంలో 189 మందికి కరోనా పాజిటివ్
మనిషి చావుకు కారణమైన కోడిపై కేసు
కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటును కుదిపేసే పెద్ద తప్పు చేశాడు..