మూన్ మిషన్ పై ఇస్రో కీలక అప్డేట్: వ్యోమగాములుగా భారత వైమానిక దళ పైలట్లు

మూన్ మిషన్ పై ఇస్రో కీలక అప్డేట్: వ్యోమగాములుగా  భారత వైమానిక దళ పైలట్లు

చంద్ర మిషన్ గగన్ యాన్పై ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రమిషన్ కోసం భారత వైమానిక దళానికి  చెందిన నలుగురు టెస్ట్ ఫైలట్లను అస్ట్రోనాట్-డిసిగ్నేట్ లుగా ఎంపిక చేసింది. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత 2040నాటికి చంద్రునిపై మొదటిసారిగా భారతీయ వ్యోమగాములను పంపేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ పైలట్ లను ఆస్ట్రోనాట్-డిసిగ్నేట్ లుగా ఎంపిక చేశామని ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్ నాథ్ చెప్పారు. 

 గగన్ యాన్  ప్రోగ్రామ్తో అంతరిక్ష పరిశోధనలో తదుపరి దశ లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. భారతీయ వ్యోమగాములను మూడు రోజుల పాటు లో ఎర్త్ ఆర్బిట్(LEO) లోకి పంపాలని.. వారిని తిరిగి సముద్ర జలాల్లో సురక్షితంగా దింపేందుకు ప్లాన్ చేస్తోంది. ఎంపిక చేయబడిన నలుగురికి ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ(ATF) లో శిక్షణ ఇస్తారు. 

గగన్ యాన్ మిషన్ 

మానవులను సురక్షితంగా రవాణ చేయగల సమార్థ్యం ఉన్న మానవ రేటెడ్ లాంచ్ వెహికిల్(HLVM3), క్రూ మాడ్యుల్(CM), సర్వీస్ మాడ్యుల్(SM) తో కూడిన ఆర్బిటల్ మాడ్యుల్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్లతో సహా క్లిష్టమైన సాంకేతిక  పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ లో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లైట్ లతో పాటు రెండు ఒకేలా ఉండే అన్ క్రూడ్ మెషన్లు(G1& G2) మనుషులతో కూడిన మిషన్ కు ముందు ఉంటాయి. 

క్రూ మాడ్యుల్ అంటే.. 

క్రూ మాడ్యుల్ (CM).. అంతరిక్షంలో వ్యోమగాములకోసం ఏర్పాటు చేసిన భూమి లాంటి వాతావరణంతో నివాసయోగ్యమైన స్థలం. అంతేకాదు ఇది సురక్షితంగా రీ ఎంట్రీకోసం రూపొందించబడింది. అత్యవసర పరిస్థితుల కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్(CES) కూడా ఉంటుంది. 

టెస్ట్ వెహికిల్ (TV-D1) మొదటి డెవలప్ మెంట్ ఫ్లైట్ ను 2023 అక్టోబర్ 21న ప్రారంభించారు. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ విమానంలో అబార్ట్ ను విజయవంతంగా ప్రదర్శించింది. ఆ తర్వాత క్రూ మాడ్యూల్ నుంచి వేరు చేయబడిన భాగం బంగాళాఖాతం సముద్ర జలాల్లోకి సురక్షితంగా చేరుకుంది. 

ఈ టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ తర్వాత తదుపరి మానవ రహిత మిషన్లు, అంతిమ మానవ అంతరిక్ష మిషన్ 2025లో ప్రారంభించబడుతుందని అంచనా వేస్తు్న్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.