జాబ్స్ స్పెషల్.. తొలి ప్రైవేట్​ రాకెట్​ ప్రారంభ్​

జాబ్స్ స్పెషల్.. తొలి ప్రైవేట్​ రాకెట్​  ప్రారంభ్​

దేశంలో మొదటిసారిగా ప్రైవేట్​ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్​ – సబ్​ ఆర్బిటల్​ (వీకే–ఎస్​) రాకెట్​ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్​ ధావన్​ స్పేస్​ సెంటర్​ (షార్​)లోని సౌండింగ్​ రాకెట్​ కాంప్లెక్స్​ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. విక్రమ్​ సబ్​ ఆర్బిటర్ (వీకే–ఎస్​) రాకెట్​ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. హైదరాబాద్​కు చెందిన స్టార్టప్​ సంస్థ స్కైరూట్​ ఏరోస్పేస్​ చేపట్టిన ఈ మొత్తం మిషన్​ను ప్రారంభ్​గా నామకరణం చేశారు. 

ఇస్రో సహకారంతో స్కైరూట్​ ఏరోస్పేస్​ స్టార్టప్​ సంస్థ తయారు చేసిన విక్రమ్​–ఎస్​ రాకెట్​ అంతరిక్షంలోకి తీసుకెళ్లిన పేలోడ్​ల్లో ఒకటి విదేశీ సంస్థకు చెందింది. కాగా, రెండు భారత దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్​కిడ్జ్​ అనే ఏరోస్పేస్​ స్టార్టప్​ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల ఫన్​–శాట్​ పేలోడ్​.   

స్కైరూట్​ ఏరోస్పేస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ అభివృద్ధి చేసిన ఈ రాకెట్​కు ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్​ సారాభాయ్​కి నివాళిగా విక్రమ్​–సబ్​ ఆర్బిటల్​ (వీకే–ఎస్​) అని నామకరణం చేశారు.