చంద్రయాన్ –3 ప్రయోగంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను దించిన ఇస్రో కీలక విషయాలను రాబట్టింది. ఆ సమాచారంతో చంద్రయాన్ 4ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకువచ్చి, వాటి ద్వారా మరిన్ని విషయాలు రాబట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు చంద్రయాన్ 4ను ప్రయోగించనుంది.
On #Chandrayaan4, #ISRO chairman S Somanath says "Chandrayaan-4 is a concept that we are now developing as a continuation of the Chandrayaan series. Our Prime Minister has announced that an Indian will land on the Moon in 2040, if that has to happen, we need to have a continuous… pic.twitter.com/81Ym2wMWSI
— ISRO InSight (@ISROSight) April 10, 2024
14 రోజులపాటు (ఒక లూనార్ డే అంటే భూమిపై 14 రోజులకు సమానం) చంద్రుడిపై చంద్రయాన్ 4 పరిశోధనలు జరిపి తిరిగి 14 రోజుల తర్వాత భూమికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. చంద్రుడిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. పగలు సమయంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపు 127 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా. రాత్రి సమయాల్లో 14 రోజులపాటు గడ్డకట్టుకుపోయే చలి ఉంటుందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పగలు సమయంలోనే చంద్రయాన్ 4ను ల్యాండ్ చేయనున్నారు. ఈ యాత్రను 2040లో చేపట్టాలని ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే చెప్పింది.
చంద్రుడిపైన ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి వాటిని మరింత విశ్లేషించేందుకు భూమిపైకి తీసుకురావడమే చంద్రయాన్ 4 ప్రాథమిక లక్ష్యం. ఒకవేళ చంద్రయాన్ 4 విజయవంతమై తిరిగి భూమిపైకి వస్తే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది. ఇక చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండ్అయిన శివశక్తి పాయింట్‌కు దగ్గరలోనే చంద్రయాన్ 4 కూడా ల్యాండ్ కానున్నది.