అంతరిక్షంలో అద్భుతానికి నాంది పలికేందుకు ఇస్రో సన్నద్ధమైంది.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా-3 శాటిలైట్ ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. దాదాపు 550 కిలోల బరువున్న శాటిలైట్ లను హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ లోకి పంపేందుకు ఇస్రో తన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV C59 ) ని ఉపయోగించనుంది. ఈ శాటిలైట్ ను బుధవారం (డిసెంబర్ 4) సయాంటీరం 4: 08 గంటలకు పంపనుంది ఇస్రో.ఈ మేరకు ఇస్రో ఇప్పటికే ఓ ప్రకటన చేసింది.
ఈ ప్రయోగం ద్వారా సూర్య కిరణాలని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనుంది ఈ శాటిలైట్. అంతే కాకుండా.. కృత్రిమంగా సూర్య గ్రహణాన్ని సృష్టించడం వంటి ప్రయోగాలకు కీలకంగా మారనుంది ఈ ఉపగ్రహం.
⏳ Less than 36 hours to go!
— ISRO (@isro) December 3, 2024
🚀 Join us LIVE for the PSLV-C59/PROBA-3 Mission! Led by NSIL and executed by ISRO, this mission will launch ESA’s PROBA-3 satellites into a unique orbit, reflecting India’s growing contributions to global space exploration.
📅 Liftoff: 4th Dec… pic.twitter.com/yBtA3PgKAn
ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ మీటింగ్ ని సోమవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా నిర్వహించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఆ తర్వాత షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ నేతృత్వంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ఈ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రయోగానికి మంగళవారం ( డిసెంబర్ 3, 2024 ) మధ్యాహ్నం 2:38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించింది ఇస్రో.