
ఇస్రో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో సెంటర్లు, యూనిట్లలో సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్‌సీ’'(గ్రూప్- ఏ గెజిటెడ్) పోస్టులను భర్తీ చేయనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 303 పోస్టులను భర్తీ చేయబోతుంది.
అర్హతలు ఏంటి..
ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు 14.06.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25న ప్రారంభమైంది. జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు
- సైంటిస్ట్/ఇంజనీర్ 'SC' (ఎలక్ట్రానిక్స్): 90 పోస్టులు
- సైంటిస్ట్/ఇంజనీర్ 'SC' (మెకానికల్): 163 పోస్టులు
- సైంటిస్ట్/ఇంజనీర్ 'SC' (కంప్యూటర్ సైన్స్): 47 పోస్టులు
- సైంటిస్ట్/ఇంజినీర్ 'SC' (ఎలక్ట్రానిక్స్) – అటానమస్ బాడీ – PRL: 2 పోస్ట్‌లు
- సైంటిస్ట్/ఇంజనీర్ 'SC' (కంప్యూటర్ సైన్స్) – అటానమస్ బాడీ – PRL: 1 పోస్ట్
దరఖాస్తు ఫీజు: రూ.250గా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100గా పొందుతారు. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూఢిల్లీ, తిరువనంతపురంలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
- isro.gov.in వద్ద ISRO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- 'కెరీర్స్' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'ఇస్రో సైంటిస్ట్/ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2023' నోటిఫికేషన్ లింక్‌ను సెలక్ట్ చేయాలి.
- ప్రకటన PDFని పూర్తిగా చదివి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
- సూచించిన విధంగా దరఖాస్తు ఫారమ్‌ను నింపి..ధృవపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము చెల్లించి, చివరకు దరఖాస్తు ఫారమ్‌ను సబ్ మిట్ చేయాలి.
- ISRO సైంటిస్ట్/ఇంజనీర్ అప్లికేషన్ ఫారమ్ PDFని డౌన్‌లోడ్ చేసుకోని..భవిష్యత్తు సూచన కోసం దాన్ని సేవ్ చేయాలి.