National Space Day: చంద్రయాన్ -3 మిషన్ కొత్త చిత్రాలను విడుదల చేసిన ఇస్రో

National Space Day: చంద్రయాన్ -3 మిషన్ కొత్త చిత్రాలను విడుదల చేసిన ఇస్రో

నేషనల్ స్పేస్ దినోత్సవానికి ముందురోజున చంద్రయాన్ 3 మిషన్ నుంచి అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది ఇస్రో. భారత్ చేపట్టిన చారిత్రాత్మక చంద్రయాత్రలో చంద్రునిపై ఆకర్షణీయమైన దృశ్యాలను విడుదల చేసింది. చంద్రుని ఉపరితలంపై ప్రజ్ణాన్ రోవర్ మొదటి చిత్రాలతో పాటు  వివిధ దశలను తెలిపి ఫొటోలను షేర్ చేసింది ఇస్రో.

విక్రమ్ ల్యాండర్ నుంచి ర్యాంప్ పైకి పగ్నాన్ రోవర్ చంద్రునిపై దిగుతున్నప్పుడు నుంచి ఇప్పటివరకు తన లెఫ్ట్ అండ్ రైట్ నావిగేషన్ కెమెరాల ద్వారా సంగ్రహించిన అద్బుతమైన చిత్రాలను తీసిన చిత్రాలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X ద్వారా  పంచుకుంది.

రోవర్ చిత్రాలతోపాటు విక్రమ్ లోని ల్యాండర్  ఇమేజర్ కెమెరా నుంచి అద్భుతమైనర విజువల్స్ ను ఇస్రో ఆవిష్కరించింది. ఈ చిత్రాలను దాని కీలకమైన చంద్ర కక్ష్య చొప్పంచే విన్యాసానికి ముందుకు  చంద్రుని అవతలి వైపుకు అంతరిక్ష నైక విధానాన్ని వర్ణిస్తాయి. 

చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయి ఏడాది అయిన సందర్భం  పురస్కరించుకుని ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడానికి భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో ఈ చిత్రాలు విడుదలయ్యాయి .