GSLV-F15 ప్రయోగం..కొనసాగుతున్న కౌంట్ డౌన్ ..జనవరి 29న నింగిలోకి నావికా ఉపగ్రహం

GSLV-F15 ప్రయోగం..కొనసాగుతున్న కౌంట్ డౌన్ ..జనవరి 29న నింగిలోకి నావికా ఉపగ్రహం

స్వదేశీ క్రయోజెనిక్ టెక్నాలజీతో తయారు చేసిన GSLV F15 రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ కొనసాగుతోంది..రేపు (జనవరి 29) ఉదయం 6గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఇస్రో ప్రయోగాల్లో ఇది 100వ మిషన్.  –

GSLV F15 రాకెట్ ద్వారా NVS 02 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఉంచనున్నారు. NVS 01 రెండో తరం ఉపగ్రహాల్లో మొదటిది. దీనిని మే 29, 2023లో GSLV F12 రాకెట్ ద్వారా ప్రయోగించారు. NVS సిరీస్ లోని రెండో శాటిలైట్  NVS 02 ను NVS  01 మాదిరిగానే C బ్యాండ్ లో పేలోడ్ తోపాటు, L1, L5 , Sబ్యాండ్ లలో నావిగేషన్ పేలోడ్ తో ఉంచబడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. 

ISRO ప్రకారం..నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) అనేది ఇండియాకు చెందిన స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్.. ఇది దేశంలోని కస్టమర్లకు ఖచ్చితమైన స్థానం, వేగం,సమయ (PVT) సేవలను అందించడానికి రూపొందించబడింది. NVS-01/02/03/04/05 సేవల కొనసాగింపును నిర్ధారించడానికి మెరుగుపరచబడిన లక్షణాలతో NavIC బేస్ లేయర్ కాన్స్టెలేషన్‌ను పెంచడానికి ఉద్దేశించబడింది. 

NVS-02 శాటిలైట్ ఇతర ఉపగ్రహ ఆధారిత పని కేంద్రాల సపోర్టుతో UR శాటిలైట్ సెంటర్ (URSC)లో రూపొందించబడింది. GSLV-F15 భారతదేశం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) 17వ ఫ్లైట్..స్వదేశీ క్రయో స్టేజ్‌తో 11వ ఫ్లైట్ అని ఇస్రో తెలిపింది. ఇది స్వదేశీ క్రయోజెనిక్ దశతో GSLV ఎనిమిదవ ప్రయోగం.