సెంచరి కొట్టిన ఇస్రో.. GSLV F-15 ప్రయోగం విజయవంతం

సెంచరి కొట్టిన ఇస్రో.. GSLV F-15 ప్రయోగం విజయవంతం
  • నావిక్ కూటమిలోకి ఎన్ వీఎస్–02 ఉపగ్రహం   

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. ఇస్రో వందో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. GSLV F-15 ప్రయోగం విజయవంతం చేసి  ఇస్రో వంద రాకెట్లు ప్రయోగించి సెంచరీ కొట్టింది.  షార్ నుంచి ప్రయోగించిన GSLV F15 రాకెట్ విజయవంతంగా ఎన్ వీఎస్–02 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఇప్పటివరకు దేశీయ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించి ఐదు ఉపగ్రహాలను పంపిన ఇస్రో.. త్వరలో మరో నాలుగు నావిగేషన్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. ఈ చరిత్రాత్మక ప్రయోగంలో జీఎస్ఎల్వీ రాకెట్  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్గా వి.నారాయణన్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి రాకెట్ ప్రయోగం ఇది. ఈ ప్రయోగం సక్సెస్ తో షార్ లో శాస్త్రవేత్తల సంబరాలు చేసుకున్నారు.  

GSLV F15 రాకెట్ ద్వారా NVS 02 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్ష్యతో ప్రవేశపెట్టనుంది. NVS 01 రెండో తరం ఉపగ్రహాల్లో మొదటిది. దీనిని మే 29, 2023లో GSLV F12 రాకెట్ ద్వారా ప్రయోగించారు. NVS సిరీస్ లోని రెండో శాటిలైట్  NVS 02 ను NVS  01 మాదిరిగానే C బ్యాండ్ లో పేలోడ్ తోపాటు, L1, L5 , Sబ్యాండ్ లలో నావిగేషన్ పేలోడ్ తో ఉంచబడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. 

ISRO ప్రకారం..నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) అనేది ఇండియాకు చెందిన స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్.. ఇది దేశంలోని కస్టమర్లకు ఖచ్చితమైన స్థానం, వేగం,సమయ (PVT) సేవలను అందించడానికి రూపొందించబడింది. NVS-01/02/03/04/05 సేవల కొనసాగింపును నిర్ధారించడానికి మెరుగుపరచబడిన లక్షణాలతో NavIC బేస్ లేయర్ కాన్స్టెలేషన్‌ను పెంచడానికి ఉద్దేశించబడింది. 

NVS-02 శాటిలైట్ ఇతర ఉపగ్రహ ఆధారిత పని కేంద్రాల సపోర్టుతో UR శాటిలైట్ సెంటర్ (URSC)లో రూపొందించబడింది. GSLV-F15 భారతదేశం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) 17వ ఫ్లైట్..స్వదేశీ క్రయో స్టేజ్‌తో 11వ ఫ్లైట్ అని ఇస్రో తెలిపింది. ఇది స్వదేశీ క్రయోజెనిక్ దశతో GSLV ఎనిమిదవ ప్రయోగం.