విత్తనాలు మొలకలయ్యాయ్.. అంతరిక్షంలో ఇస్రో అద్భుతం

విత్తనాలు మొలకలయ్యాయ్.. అంతరిక్షంలో ఇస్రో అద్భుతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష వ్యవసాయంలో సంచలనాత్మక మైలురాయిని సాధించింది. పీఎస్ఎల్వీ-సీ60 రాకెట్‌ ప్రయోగంలో భాగంగా ఇస్రో రోదసీలోకి పంపిన అలసంద(బొబ్బర్లు) విత్తనాలు.. మొక్కలుగా రూపాంతరం చెందినట్లు ఇస్రో(ISRO) ప్రకటించింది. ఇటీవల ఈ విత్తనాలు మొలకెత్తగా, ఇప్పుడు వారి నుంచి ఆకులు రావడం గణనీయమైన ముందడుగుగా ఇస్రో తెలిపింది. విత్తనాలు.. మొలకలుగా మారుతున్న వీడియోను ఇస్రో పోస్ట్ చేసింది.

మైక్రోగ్రావిటీ పరిస్థితులలో కేవలం నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తాయని ఇస్రో తెలిపింది. అందుకోసం CROPS (కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్)ని ఉపయోగించినట్లు పేర్కొంది. భవిష్యత్తులో దీర్ఘకాలిక మిషన్లకు కీలకమైన అంతరిక్షంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అన్వేషించడానికి ఇస్రో చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రయోగం ఒక భాగం.

"ఈ విజయం అంతరిక్షంలో మొక్కలు పెంచగల ఇస్రో సామర్థ్యాన్ని తెలియజేయడమే కాకుండా.. భవిష్యత్తులో దీర్ఘకాలిక మిషన్లకు అవసరమైన విలువైన సమాచారాన్ని అందిస్తుంది.." అని ఇస్రో ఎక్స్‌లో పేర్కొంది.

ALSO READ | అంతరిక్షంలో మొక్కలు పెంచనున్న ఇస్రో.. ఇందు కోసం ఏం చేస్తారంటే..