ప్రోబ్​–2 మిషన్ సక్సెస్​..

ప్రోబ్​–2 మిషన్ సక్సెస్​..

యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ(ఈఎస్​ఏ)కు చెందిన ప్రాజెక్ట్​ ఫర్​ ఆన్​ బోర్డ్​ అటానమీ(ప్రోబ్​)–3 మిషన్​ను ఇస్రో సతీష్​ ధావన్​ స్పేస్ సెంటర్​ నుంచి పోలార్​ శాటిలైట్​ లాంచ్​ వెహికిల్​ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణాలను, కరోనా ఉపరితలాన్ని అధ్యయనం చేయడమే ఈ మిషన్​ లక్ష్యం. దీన్ని ఇన్​ ఆర్బిట్​ డెమొన్​స్ట్రేషన్​ మిషన్​ అంటారు. 

    
ప్రతి 19.7 గంటలకు ఒక్కసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 కిలోమీటర్ల దూరం(పెరీజి)లో 60,530 కిలోమీటర్ల దూరం(అపాజీ)లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. 
    
యూరోపియన్​ అంతరిక్ష సంస్థకు చెందిన వేగా–సి రాకెట్​కు అంతటి సామర్థ్యం లేకపోవడం, ఏరియన్​–6 రాకెట్​ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్​ఏ ఎంపిక చేసుకున్నది. ప్రోబా–3 మిషన్​లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. 

కరోనా గ్రాఫ్​ స్పేస్​ క్రాఫ్ట్​ (సీఎస్​సీ): కరోనాపై అధ్యయనం చేస్తుంది. దీని బరువు 340 కిలోలు. 

ఆక్యుల్జర్​ స్పేస్​ క్రాఫ్ట్​(ఓఎన్​సీ): సూర్యకాంతిని అడ్డుకోవడానికి కరోనాగ్రాఫ్​ స్పేస్​క్రాఫ్ట్​కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని బరువు 200 కిలోగ్రాములు. 
    
భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ఈ రెండు ఉపగ్రహాలు ఒక దానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. 
    
ప్రోబా –3 రెండేండ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది సోలార్​ అబ్జర్వేషన్​ టెక్నాలజీతో పనిచేస్తుంది.