పీఎస్ఎల్వీ సీ - 59 సక్సెస్

పీఎస్ఎల్వీ సీ - 59 సక్సెస్
  • ఈఎస్ఏకు చెందిన ప్రోబా–3 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో చేర్చిన ఇస్రో రాకెట్ 
  • ఎన్ఎస్ఐఎల్​ భాగస్వామ్యంతో ప్రయోగం
  • సైంటిస్టులకు ఇస్రో చైర్మన్​ సోమనాథ్​ అభినందనలు

న్యూఢిల్లీ:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ –59 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీశ్​ ధావన్​ స్పేస్​ సెంటర్​ (షార్​) నుంచి గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహక నౌక నిప్పులు చిమ్మూతూ నింగిలోకి దూసుకెళ్లింది. యురోపియన్​ స్పేస్​ ఏజెన్సీ (ఈఎస్ఏ)కి చెందిన ప్రోబా–3తోపాటు మరికొన్ని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది.  బుధవారమే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా.. శాటిలైట్స్​లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతో నేటికి వాయిదా పడింది. కాగా, పీఎస్ఎల్వీ సీ–59 ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఇస్రో చైర్మన్​ ఎస్​. సోమనాథ్​ హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన సైంటిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. 

పీఎస్​ఎల్వీ సీ–59 రాకెట్​ప్రయోగించిన 18 నిమిషాల్లోనే ప్రోబా–3 శాటిలైట్స్​ను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ ప్రయోగాన్ని న్యూస్పేస్​ ఇండియా లిమిటెడ్​ (ఎన్ఎస్ఐఎల్) భాగస్వామ్యంతో చేపట్టినట్టు చెప్పారు. డిసెంబర్​లో ‘స్పేటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ-సీ–60 ప్రయోగం ఉంటుందన్నారు. ఈ శాటిలైట్​తోనే ఆదిత్య ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-1 సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగుతుందన్నారు. కాగా, ప్రయోగం విజయవంతంపై ఎన్ఎస్ఐఎల్​ చైర్మన్, ఎండీ డీ రాధాకృష్ణన్​ సంతోషం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగంతో తొలిసారి పీఎస్ఎల్వీ రాకెట్​ 60 వేల కి.మీ.దూరంలోని కక్ష్యలోకి చేరుకున్నదని చెప్పారు.  

సూర్యుడి కరోనాపై పరిశోధనకు ప్రోబా 3

ప్రోబా –3 శాటిలైట్స్​ను యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ తయారు చేసింది. భారత్​కు చెందిన  ఎన్ఎస్ఐఎల్ భాగస్వామ్యంతో వీటిని ఇస్రో నింగిలోకి పంపనుంది. ఇందులో కరోనాగ్రాఫ్​ స్పేస్​క్రాఫ్ట్​ (సీఎస్​సీ), ఓకల్టర్​ స్పేస్​క్రాఫ్ట్​ (ఓఎస్​సీ) అనే  రెండు శాటిలైట్స్​ ఉన్నాయి. వీటి బరువు 545  కిలోలు, సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడమే లక్ష్యంగా వీటిని ప్రయోగించారు. సంపూర్ణ సూర్యగ్రహణంపై ఇవి అధ్యయనం చేస్తాయి. ఇవి మొదట్లో  ఒకే కాన్ఫిగరేషన్​లో  భూకక్ష్యలో విహరిస్తాయి.  అనంతరం విడిపోయి పరస్పరం సమన్వయంతో కక్ష్యలో తిరుగుతాయి.