ఇస్రో 100వ ప్రయోగానికి సిద్ధం

ఇస్రో 100వ ప్రయోగానికి సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 100వ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్​ ధవన్​ అంతరిక్ష కేంద్రం(షార్)లోని రెండో లాంచ్​ప్యాడ్​ నుంచి 2500 కిలోల బరువున్న నావిక్​–2(ఎన్​వీఎస్) ఉపగ్రహాన్ని జీఎస్​ఎల్వీ–ఎఫ్​15 రాకెట్​ ద్వారా 2025, జనవరి 29న ప్రయోగించనున్నది. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్​–02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్సఫర్​ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నది. దీని ద్వారా దేశీయ నావిగేషన్​ వ్యవస్థ నావిక్​ మరింత విస్తృతం కానున్నది. ఈ సిరీస్​లో మరో మూడు ఉపగ్రహాలను ఈ ఏడాదిలోనే  ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతున్నది. 

ప్రయోగం ప్రత్యేకతలు

  • శ్రీహరికోటలో రాకెట్​ కేంద్రం నిర్మించిన తర్వాత ఇస్రో చేపడుతున్న 100వ ప్రయోగం ఇది.
  • నావిక్​–2 ఉపగ్రహం నావిగేషన్​ ఉపగ్రహాల సిరీస్ లో తొమ్మిదోది. నావిక్​ సిరీస్ లో రెండోది. అయితే, నావిక్​ సిరీస్​లో మొదటిది ఎన్వీఎస్​–01 ఉపగ్రహం. దీనిని జీఎస్​ఎల్వీ–ఎఫ్​12 రెకెట్ ద్వారా 2023లో ఇస్రో ప్రయోగించింది.
  • జీఎస్ ఎల్వీ–ఎఫ్​15 రాకెట్​ జీఎస్ఎల్వీ సిరీస్​లో 17వ ప్రయోగం.
  • పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన క్రయోజనిక్​ ఇంజిన్​తో 11వ ప్రయోగం.