భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రయోగానికి సిద్దమవుతోంది. ఫిబ్రవరి 17,2024న సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోట నుంచి GSLV-F14/INSAT 3DS మిషన్ ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ వ్యోమనౌక వాతావరణ శాటిలైట్ INSAT-3DS ని జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
GSLV మూడు దశల ప్రయోగించబడుతుంది. 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుంది. ఇది ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ ఉపయోగించి క్రయోజెనిక్ దశతో ఘన, ద్రవ చోదక దశలను కలిగి ఉంటుంది.ప్రయోగ సమయంలో Ogive పేలోడ్ ఫెయిరింగ్ ద్వారా రక్షించబడుతుంది. GSLV కమ్యూనికేషన్, నావిగేషన్, భూమి వనరుల సర్వేలకోసం వివిధ అంతరిక్ష నౌకలను ప్రయోగించగలదు.
INSAT-3DS ఉపగ్రహం
INSAT-3DS ఉపగ్రహం జియోస్టేషనరీ ఆర్బిట్ నుంచి వాతావరణ పరిశీలనలకోసం ఫాలో ఆన్ మిషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) పూర్తిగా నిధులు సమకూర్చింది. ఇది వాతావరణ పరిశీలనలను మెరుగుపర్చడానికి వాతావరణ అంచనా కోసం భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి , విపత్తు హెచ్చరికలు చేయడం కోసం ఈ శాటిలైట్ రూపొందించబడింది. దీని అభివృద్ధిలో భారత్ కు చెందిన పలు కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాయి.
మిషన్ లక్ష్యాలు
భారత వాతావరణ శాఖ(IMD) నేషనల్ సెంటర్ ఫర్ మీడియ్ రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్(NCMRWF) తో సహా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లోని వివిధ శాఖలు మెరుగైన వాతావరణ సూచనలు , వాతావరణ సేవల కోసం INSAT-3DS డేటాను ఉపయోగిస్తాయి.
భూమి ఉపతరితలం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, వాతావరణ ఫ్రొఫైల్ డేటాను అందించడం, డేటా సేకరణ, వ్యాప్తిని సులభతరం చేయడం, ఉపగ్రహ సహాయక శోధన, రెస్క్యూ సేవలను అందించడం ఈ మిషన్ ముఖ్యమైన లక్ష్యాలు.