
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయెగానికి సిద్దమైంది. 2023 మే 29న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10:42 గంటలకు ఎన్‌విఎస్-01 నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనుంది. 2,232 కిలోగ్రాముల బరువున్న ఎన్‌విఎస్-01 నావిగేషన్ శాటిలైట్‌ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి పంపేందుకు ఈ మిషన్ ను రూపొందించబడింది.
నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్ (నావిక్) అవసరాల కోసం రూపొందించిన రెండోతరం ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్–01 మొదటిది. నావిక్ అనేది అమెరికాకు చెందిన జీపీఎస్ తరహాలోనే భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ. ఈ ప్రయోగం విజయవంతమైతే ఎన్‌వీఎస్–01.. రోదసీలో 12ఏళ్లపాటు సేవలందించనుంది.