
ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది. పీఎస్ఎల్వీ-సీ 56 రాకెట్‌ను జులై 30న ఉదయం 6.30 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించనుంది. నింగిలోకి దూసుకెళ్లేలా షెడ్యూల్ రెడీ చేశారు.
ఈ రాకెట్ తో సింగపూర్ కు చెందిన 7 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ప్రధానంగా సింగపూర్ కు చెందిన డీఎస్ టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఐఆర్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. దీంతో పాటు సింగపూర్ నాన్యాంగ్ టెక్నాలాజికల్ యూనివర్సిటీకి చెందిన వెలాక్స్-ఏఎం, ఆర్కేడ్, స్కూబ్-2 ఉపగ్రహాలను.. సింగపూర్ న్యూస్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన న్యూలియాన్, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన గెలాసియా-2, ఏలియనా ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ కు చెందిన ఓఆర్ బి-12 ఉపగ్రహాలను కక్షలోకి పంపనుంది.
పీఎస్ఎల్వీ -సీ 56 రాకెట్ 44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువుతో ఉంటుంది. శిఖర భాగాన ఉన్న ఉపగ్రహాన్ని 535 కిలోమీటర్ల ఎత్తులో రోదసిలో విడిచిపెడుతుంది. మొదట దీన్ని జూలై 26న ప్రయోగించాలని ఇస్రో భావించింది కానీ టెక్నికల్ రీజన్స్ తో జులై 30కి వాయిదా వేసింది.