చంద్రుడిపై పరిశోధనలకుగాను ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ మాడ్యూల్ నుంచి బయటకొచ్చిన రోవర్.. చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతోంది.
ఒకవైపు ఇలా చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా సాగుతుంటే.. మరోవైపు ఈ ప్రయోగం దెబ్బకు రికార్డులు బద్ధలవుతున్నాయి. చంద్రుడి ఉపరితలంపై 'చంద్రయాన్ -3' సురక్షితంగా ల్యాండ్ అయ్యాక.. 'నేను నా లక్ష్యాన్ని చేరుకున్నా..' అంటూ చంద్రయాన్-3 ఇచ్చిన సందేశాన్ని ఇస్రో మూడు రోజుల క్రితం ట్వీట్ చేసింది. ఇది దేశంలోనే అత్యధిక లైక్స్ (841.3K) వచ్చిన ట్వీట్‌గా రికార్డు సృష్టించింది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
'India??,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon ?!.
Congratulations, India??!#Chandrayaan_3#Ch3
గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై విజయం తర్వాత విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ (796.2K) లైక్స్‌తో ఇదివరకు మొదటి స్థానంలో ఉండగా.. చంద్రయాన్ -3 ఆ రికార్డును బ్రేక్ చేసింది.
Special win. Thank you to all our fans for turning up in numbers. ??? pic.twitter.com/hAcbuYGa1H
— Virat Kohli (@imVkohli) October 23, 2022
అలాగే, యూట్యూబ్‌లో ఎక్కువ మంది ప్రత్యక్ష ప్రసారాలలో వీక్షించిన ఈవెంట్‌గా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రత్యక్ష ప్రసారాలను యూట్యూబ్‌లో 8.06 మిలియన్ల మంది వీక్షించారు. గతంలో బ్రెజిల్- దక్షిణ కొరియా మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను 6.15 మిలియన్ల మంది వీక్షించారు.
Most viewed Live streams on YouTube.
— Vinit ? Shinde ?? (@iamvinitshinde) August 23, 2023
Today ISRO's #Chandrayaan3 broke the live streaming record. (8.06 Million people were watching it on YT) ??? pic.twitter.com/PcuOGLMjsT
isro tweet over Changrayaan 3 breaks virat kohli most likes record
Changrayaan 3, Changrayaan 3 Landing, ISRO, Indian Space Reasearch organisation, Moon, Vikram Lander, Pragyan Rover, Virat Kohli, Telugu News, Latest ISRO Update, Sports News