శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీశాట్ – 30 ఉపగ్రహం విజయవంతమైంది. ప్రెంచ్ గయానా నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్ కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్ – 30 ప్రయోగం విజయవంతంగా ప్రయోగించింది. నాణ్యమైన టెలివిజన్ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్ , బ్రాడ్ క్రాస్టింగ్ సేవలు లక్ష్యంగా ఉపగ్రహం రూపొందించారు. ఫ్రెంచ్ భూభాగం కౌరౌలోని అరియాన్ లాంఛ్ కాంప్లెంక్స్ నుంచి ప్రయోగించారు. తెల్లవారుజామున 2 గంటల 35 నిమిషాలకు ఉపగ్రహం ప్రయోగించారు. 38 నిమిషాల్లో అరియాన్ – 5 యుటెల్సాట్ , జీశాట్ – 30 జీయోస్టేషనరీ ట్రాన్స్ ఫర్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ ఉపగ్రహం ద్వారా టెలివిజన్, టెలీకమ్యూనికేషన్ బ్రాడ్ కాస్టింగ్ కు సంబంధించి మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. జీశాట్ బరువు సుమారు 3 వేల 357కిలోలు. ఐ-3కే ప్లాట్ ఫామ్ లో దీన్ని తయారు చేశారు. ఇన్శాట్-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 పనిచేయనుంది. భారత్ తో పాటు అనుబంధ దేశాలకు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్లో సిగ్నల్ అందించనుంది. గల్ఫ్ దేశాలకు సీ బ్యాండ్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ ద్వారా సేవలు అందిస్తారు.