చంద్రయాన్ 3 అప్ డేట్స్: ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ లాండర్ లేటెస్ట్ ఫొటోస్ ఇవిగో..

చంద్రయాన్ 3 అప్ డేట్స్: ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ లాండర్ లేటెస్ట్ ఫొటోస్ ఇవిగో..

చంద్రుని ఉపరితలం అధ్యయనంలో ఇస్రో మరింత ముందుకు వెళ్తోంది. చంద్రయాన్ 3 విజయవంతమైన తర్వాత చంద్రుని ఉపరితలంపై విశ్రాంతి తీసుకుంటు న్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ణాన్ రోవర్ల హై రెజల్యూషన్ లేటెస్ట్ ఫొటోలను అందుకుంది. ఈ చిత్రాలు ఇంతకుముందుకు కంటే అతి తక్కువ ఎత్తు నుంచి క్యాప్చర్ చేయడం జరిగింది. గతంకంటే అత్యంత స్పష్టంగా చంద్రుని ఉపరితలాన్ని క్యాప్చర్ చేయడంలో ఇస్రో తన సామర్థ్యాన్ని పెంచుకుంది. 

మార్చి 15, 2024న సంగ్రహించిన ఈ ఫొటోలను పరిశోధకుడు చంద్ర తుంగతుర్తి ప్రాసెస్ చేశారు. ఈ కొత్తచిత్రాలు విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన రోజు అంటే ఆగస్లు 23,2023 చిత్రాల కంటే చాలా స్పష్టంగా, ఎక్కువ సమాచారాన్ని వివరంగా చూపుతున్నాయి. 

తాజా చిత్రాలు దాదాపు 65 కిలోమీటర్ల ఎత్తునుంచి సేకరించబడ్డయి. ఇవి 17 సెంటీమీటర్ల రెజల్యూషన్  పిక్సెల్ ను కలిగి ఉన్నాయి. మొదట పంపిన ఫొటోలు 100 కిలోమీటర్లు ఎత్తు నుంచి తీసినవి. వీటి పిక్సెల్స్ 20 సెంటీమీటర్ల రెజల్యూషన్ తో ఉన్నాయి. 

రెండు చిత్రాలను పక్కపక్కనే పెట్టి గమనిస్తే.. రిజల్యూషన్ లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మెరుగైన స్పష్టత ప్రజ్ణాన్ రోవర్ స్పషంగా కనిపిస్తుంది. 

ఇక చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్లు గతేడాది ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధృవంపై దిగిన విషయం తెలిసిందే. భారత దేశ చరి త్రలో చంద్రయాన్ 3 సక్సెస్ ఓ మైలురాయి. చంద్రుని దక్షిణ దృవంపై ల్యాండింగ్ సాధించిన మొదటి దేశంగా, అంతరిక్ష నౌకను సురక్షితంగా ల్యాండ్ చేసిన నాల్గ వ దేశంగా భారత్ నిలిచింది. సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ అమెరికా, చైనాలు.. ఈ ఘనత సాధించిన దేశాల లిస్టులో ఉన్నాయి. 

14 రోజుల పాటు విక్రమ్ ల్యాంర్, ప్రజ్ణాన్ రోవర్ లు చంద్రునిపై అనేక ప్రయోగాలు చేశాయి. ఈ ప్రయోగాలు చంద్రుని పర్యావరణంపై అధ్యయనం, అవగాహనకు ఎంతో తోడ్పాటునందించాయి. భవిష్యత్ లో పరిశోధన ప్రయత్నాలను మార్గం సుగమం చేసింది. 

ఇస్రో ఇప్పటికే ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రయోగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారత్ దేశ ఆధునిక టెక్నాలజీని ప్రపంచానికి చాటి చెప్పింది. మున్ముందు అనేక సక్సెస్ సాధించేందుకు కృషి చేస్తుంది.