ఇస్రోకు రూపొందించిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్N2ను సక్సెస్ ఫుల్ గా అంతరిక్ష కక్ష్యలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని కేప్ కెనావెరల్ నుంచి స్పేస్ ఎక్స్ కుచెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించారు. GSAT-N2 బరువు 4,700 కిలోల ఉంటుంది. 14యేళ్ల పాటు సేవలందించనుంది. వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం.
అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి దీనిని ప్రయోగించారు. కక్ష్యలోకి చేరగానే ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ జీశాట్–20 ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది.
భారత్ లోని మారుమూల ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ,లక్ష్యదీప్ వంటి ప్రదేశాల్లో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నది. అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్-ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి.