
లిమా (పెరూ): ఐఎస్‌ఎఫ్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ షూటర్ల గురి అదురుతోంది. శనివారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్‌లో ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. దివ్యాన్షి 564 పాయింట్లతో రెండో గోల్డ్ గెలుచుకోగా, పారిశా గుప్తా (559), మానవి జైన్ (557) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నారు. జూనియర్ మెన్స్ పోటీల్లో సూరజ్ శర్మ (571) , నెలవల్లి ముకేశ్ (568) గోల్డ్, బ్రాంజ్ నెగ్గారు. జూనియర్ విమెన్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో మెల్వినా జోయెల్ గ్లాడ్‌సన్ (617.5).. 14వ ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు.