న్యూఢిల్లీ : జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మరో గోల్డ్ లభించింది. మెన్స్ 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో దీప్ దయాల్, కమల్‌జీత్, రాజ్ చంద్రాతో కూడిన జట్టు బంగారు పతకం గెలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ఇండియా త్రయం మొత్తంగా 1616 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. దీపక్ 545 పాయింట్లతో సత్తా చాటగా.. కమల్‌జీత్ 543, రాజ్ చంద్ర 258 పాయింట్లు రాబట్టారు.
అజర్‌బైజాన్ జట్టు ఒక్క పాయింట్ తేడాతో రజతానికి పరిమితం అవ్వగా.. అమెరికా మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. కాగా, ఈ టోర్నీలో ఇండియా 13 గోల్డ్ సహా 24 మెడల్స్‌తో చాంపియన్‌షిప్ సొంతం చేసుకుంది. ఇందులో మూడు రజతాలు, ఎనిమిది కాంస్యాలు ఉన్నాయి. ఇటలీ 5 గోల్డ్ సహా పది పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.