
లిమా (పెరూ): ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ తొండైమాన్– ప్రగతి దూబే జంట పతక రౌండ్‌కు చేరుకోకపోవడంతో పెరూ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌ను ఇండియా మూడో స్థానంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో ఇండియా ఏడు పతకాలు నెగ్గింది. ఇందులో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. అమెరికా కూడా ఏడు పతకాలు గెలుచుకున్నప్పటికీ, ఎక్కువ స్వర్ణాలతో రెండో స్థానం కైవసం చేసుకోగా.. చైనా నాలుగు స్వర్ణాలు సహా 13 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
చివరి రోజు సోమవారం రాత్రి జరిగిన ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో పృథ్వీరాజ్ – ప్రగతి జంట 134 స్కోరుతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. లక్ష్యయ్–నీరూ జోడీ 128 స్కోరుతో 13వ స్థానంతో సరిపెట్టింది. ఈ టోర్నీలో 18 ఏండ్ల యంగ్ షూటర్ సురుచి ఇందర్ సింగ్ రెండు గోల్డ్ మెడల్స్‌తో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. కాగా, వరల్డ్ కప్‌లో ఇండియా యువ షూటర్ల ఆట పట్ల నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సెక్రటరీ జనరల్ కె సుల్తాన్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఇండియా షూటింగ్ టీమ్ తదుపరి మే తొలి వారంలో సైప్రస్ వరల్డ్ కప్ (షాట్‌గన్)లో పోటీ పడనుంది.