ఐఎస్ఎస్‌ఎఫ్‌‌‌‌ వరల్డ్ కప్‌.. శ్రియాంకకు ఎనిమిదో స్థానం

 ఐఎస్ఎస్‌ఎఫ్‌‌‌‌ వరల్డ్ కప్‌.. శ్రియాంకకు  ఎనిమిదో స్థానం

లిమా (పెరూ): పారిస్ ఒలింపియన్ షూటర్ శ్రియాంక సదాంగి ఐఎస్ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌లో నిరాశపరిచింది.  విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌‌‌‌లో శ్రియాంక తొలి షాట్‌‌‌‌లోనే 10.5 పాయింట్లతో మంచి ఆరంభం దక్కించుకున్నా అదే జోరు కొనసాగించలేకపోయింది. 

మొత్తంగా 400.7 స్కోరుతో బ్రెజిల్‌‌‌‌కు చెందిన జియోవానా మేయర్‌‌‌‌తో కలిసి పోటీ నుంచి నిష్క్రమించింది. మెన్స్‌‌‌‌ 3 పొజిషన్స్‌‌‌‌లో ప్రతాప్ సింగ్‌‌‌‌ తోమార్, నీరజ్ కుమార్, చైన్ సింగ్ క్వాలిఫయింగ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో వరుసగా  17, 18, 19వ స్థానాల్లో నిలిచి  ఫైనల్‌‌‌‌కు  అర్హత సాధించలేకపోయారు.