
లిమా (పెరూ): ఇండియా స్టార్ షూటర్లు సురుచి ఇందర్ సింగ్, మను భాకర్... ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్‌ను గెలిచారు. బుధవారం జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 18 ఏళ్ల సురుచి 243.6 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మను 242.3 పాయింట్ల తేడాతో రెండో ప్లేస్‌లో నిలిచింది. చైనా షూటర్ యావో క్వియాన్‌క్సున్ బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.
వరల్డ్ కప్‌లో సురుచికి ఇది వరుసగా రెండో గోల్డ్ మెడల్ కావడం విశేషం. 28 మంది పోటీపడిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో సురుచి (582), మను (578) వరుసగా రెండు, నాలుగో ప్లేస్‌లో నిలిచారు. ఇండియాకే చెందిన మరో షూటర్ సానియమ్ (571).. 11వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్‌లో సురుచి–సౌరభ్ చౌదరీ 17 పాయింట్లతో గోల్డ్ మెడల్ నెగ్గారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా నాలుగు పతకాలతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, చైనా రెండో ప్లేస్‌లో ఉంది.