హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో 10 రోజులుగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిపోయింది. రెండ్రోజుల్లో స్కూళ్లు స్టార్ట్ అవుతుండడంతో బర్త్ సర్టిఫికెట్లు అవసరమైన వారు ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక ఇన్సూరెన్స్ పాలసీల క్లైమ్ తదితర వాటికి డెత్ సర్టిఫికెట్లు అవసరం ఉన్న వారిదీ ఇదే పరిస్థితి. డివిజన్‌స్థాయి పాలన కోసం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల(ఏఎంసీ)ను బదిలీ చేయడంతో సర్టిఫికెట్ల జారీ ఆగింది.
150 డివిజన్లలో కొత్తగా ఏఎంసీలకు బాధ్యతలు అప్పగించడంతో 30 సర్కిళ్లలోని 27మంది ఏఎంసీలు బదిలీ అయ్యారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు సపరేట్ గా ఉంటాయి. కొత్తగా వచ్చిన వారికి అవి ఇవ్వకపోవడంతో జారీ నిలిచింది.