ఫిబ్రవరి 16 నుండి తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. రోజుకు పది వేలు టోకెన్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తామన్నారు. ఆర్జిత సేవలు పునరుద్ధరణ సంబంధించి టీటీడీ బోర్డు లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ పై కమిటీని నియమించామని, బయోడిగ్రేడబుల్ లడ్డూ కవర్లను ప్రవేశపెట్టామన్నారు. త్వరలోనే తిరుమలలో అన్ని షాపుల్లో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జన్మస్థలం అభివృద్ది చేస్తామని, అక్కడ ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9:30 గంటలకు భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. తరిగొండ వెంగమాంబ బృందావనం పనులు ఫిబ్రవరి16న ప్రారంభిస్తామని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...