ఒక వ్యక్తికి రెండు పేర్లు ఉండటం సహజం. ఒకటి.. ముద్దు పేరు. రెండు.. అసలు పేరు. అదే.. ఒక ఊరుకి లేదా ఒక సిటీకి రెండు పేర్లు ఉంటే ఆసక్తికరం. అలాంటిది ఓ నగరానికి ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా మూడు పేర్లు ఉంటే.. అది తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన విషయమే. ఆ నగరం మరేదో కాదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీ. ఈ నేషనల్ క్యాపిటల్ సిటీకి దిల్లీ.. దహిలి.. డెల్హీ అనే మూడు పేర్లు ఉన్నాయి. పలుకుబడిలో డెల్హీ, ఢిల్లీ అయ్యింది.ఎందుకనే అంశంపై చర్చ మొదలైంది.
మన దేశానికే రెండు పేర్లు (ఇండియా, భారతదేశం) ఉంటే దేశ రాజధానికి మూడు పేర్లున్నాయి. ఢిల్లీని దహిలి అని ఉర్దూలో, డెల్హి అని ఇంగ్లిష్‌లో అంటారు. ఏ సిటీ పేరుకైనా దాని మూలాలు ఆ సిటీ కల్చర్, హిస్టరీలో భాగంగా ఉండాలి. పేర్ల విషయంలో జనం గందరగోళానికి గురవుతారనటంలో అర్థం ఉంది. కానీ.. సిటీ పేరు ఆ సిటీ, అక్కడి ప్రజల చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టాల్సిందేననటం భావ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఇలా ఒకటికి మించి పేర్లు ఉంటే అసలు పేరేంటో పబ్లిక్‌కి తెలియదని, ఈ కన్ఫ్యూజన్కి ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టాలని ఈ మధ్యనే బీజేపీ ఎంపీ విజయ్ గోయల్ సర్కార్‌కి సూచించారు. నేషనల్ క్యాపిటల్ పేరుని అధికారికంగా దిల్లీ (డీఐఎల్ఎల్ఐ)గా ఫైనల్ చేసి; దహిలి (డీఈహెచ్ఎల్ఐ), డెల్హి (డీఈఎల్హెచ్ఐ) పేర్లను రద్దు చేయాలంటున్నారు. ఏదైనా నగరం పేరు ఆ నగరం లేదా ప్రజల కల్చరల్ హిస్టరీని తెలిపేలా ఉండాలనే మాటే కరెక్టే. కానీ, క్యాపిటల్ సిటీలో అనేక మతాలవాళ్లు, కులాలవాళ్లు ఉంటారు. వాళ్లలో ఎవరి చరిత్ర, సంస్కృతిని ఆ పేరు గుర్తుకు తేవాలి?. దహిలి, డెల్హి పేర్లను ప్రభుత్వం రద్దు చేస్తే వాటి వెనకున్న హిస్టరీ, కల్చర్ కనుమరుగైనట్లే. అవి ప్రస్తుత, భవిష్యత్ తరాలకూ తెలియవు. మూడు పేర్లూ కొనసాగిస్తే మూడు విషయలు తెలుస్తాయి. లేకపోతే ఒక్క అంశమే మనుగడలో ఉంటుంది.
పేరు మారిస్తే ‘ఊరు’కోరు
పేర్లు ఐడియలాజికల్ డాక్యుమెంట్లు. ఆ ప్రాంతాల సోషల్, కల్చరల్, జియోగ్రాఫికల్ రియాలిటీస్ని ముందు తరాలకు చెబుతాయి. స్థానికులు సంబంధిత పేర్లతో అనుబంధాన్ని పెంచుకుంటారు. వాటిని తమవిగా సొంతం చేసుకుంటారు. ఎప్పటినుంచో ఉన్న, పలుకుతున్న పేర్లను మారిస్తే ఏదో కోల్పోతున్నామనే ఫీలింగ్ వాళ్లను అంగీకరించనివ్వదు. వ్యక్తులకు, ప్రాంతాలకు ఒకటికి మించి పేర్లు పెట్టడం మన సమాజంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా మొదటి నుంచీ ఉన్నదే. ఉదాహరణకు జపాన్ అని ఇంగ్లిష్‌లో అంటారు. అదే పేరును అరబిక్‌లో జపనీస్ అంటారు. గ్రీస్ అనే ఇంగ్లిష్ పేరును అరబిక్‌లో గ్రీక్ అని వ్యవహరిస్తారు. పిల్లలను ఇంట్లో షార్ట్ కట్ పేర్లతో ఐసూ.. చైతూ.. బుజ్జీ.. అని ముద్దుగా పిలుచుకుంటాం. కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ల పేర్లను వారసుల సంతానానికి పెట్టుకొని గుర్తుచేసుకుంటూ ఉంటాం.
కొంత మంది మతపరమైన పేర్లు పెట్టుకుంటారు. సీత, ముస్తాఫా, ఆంటోనీ వంటి పేర్లు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రెలీజియన్స్కి దగ్గరి సంబంధం ఉన్నవి. మరికొంత మంది న్యూట్రల్‌గా ఉండే నేమ్స్కి ప్రయారిటీ ఇస్తారు.
ఒకటి బ్రిటిష్ కాలంలో వచ్చింది
డిల్లి (డీఐఎల్ఎల్ఐ) పేరు మూలాలు ఢిల్లీలోని పాపులర్ కల్చర్‌లో ఉన్నాయి. స్థానికులకు సంబంధించిన ఒక ముఖ్యాంశాన్ని ప్రతిబింబిస్తున్నాయి. డెల్హి (డీఈఎల్హెచ్ఐ) అనేది బ్రిటిష్ కాలంలో పుట్టింది. దహిలి (డీఈహెచ్ఎల్ఐ) పేరు దేశంలోని పురాతన ఉర్దూ భాషాపరమైన, సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పడుతోంది. అప్పట్లో చాలా మంది కవులు, రచయితలు ఈ సిటీ గురించి చెప్పటానికి దిల్లి అనే పదంతోపాటు డెల్హి అనే పదం కూడా ఉపయోగించారు.
మూడు గురుతులు
ఢిల్లీకి ఇంద్రప్రస్థ (లేదా) హస్తినాపుర (లేదా) షాజహనాబాద్ పేరు పెట్టాలని గతంలో డిమాండ్లు వచ్చాయి. ఢిల్లీ స్పెల్లింగ్‌ని కరెక్ట్‌గా పలకాలన్న డిమాండ్ తాజాగా వచ్చింది. దిల్లి, దహిలి, డెల్హి పేర్లు మూడు వేర్వేరు లింగ్విస్టిక్, కల్చరల్ ట్రెడిషన్స్కి గుర్తులుగా నిలుస్తున్నాయి. సిటీకి, అక్కడి కల్చర్‌కి జానపద కళాకారులు, ముస్లింలు, బ్రిటిష్ పాలకులు చేసిన సేవలను పట్టిచూపుతున్నాయి.
దహిలి, డెల్హి అనేవి రాజధానికి భాషాపరమైన గుర్తింపును తెస్తున్నాయి. డిల్లి, డెల్హి, దహిలి, షాజహనాబాద్ అనే పేర్లు భాషతోపాటు కల్చర్, హిస్టరీకి సంబంధించిన ఐడెంటిటీని నిలబెడుతున్నాయి. అందువల్ల క్యాపిటల్ సిటీ ఢిల్లీకి పర్మనెంట్‌గా ఒకే ఒక్క పేరు ఉంచితే ఆ రాజసం ఉట్టిపడదు.