- కొత్తగా క్రియేట్ చేసిన సర్కారు
- యాదాద్రి, వేములవాడకు శాంక్షన్
- భద్రాద్రికి అబ్జక్షన్
- కొత్త పోస్టులపై ఎంప్లాయీస్ అభ్యంతరాలు
భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలోని 6ఏ గ్రేడ్ టెంపుల్స్ లో డీఈవో పోస్టుల భర్తీ గందరగోళంగా మారింది. ఇటీవల భద్రాచల సీతారామచంద్రస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానాల్లో డీఈవో(డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) పోస్టులకు ఎండోమెంట్డిపార్ట్మెంట్ప్రపోజల్స్ కోరింది. మూడు దేవస్థానాల నుంచి ప్రపోజల్స్ వెళ్లగా తెలంగాణ సర్కారు యాదగిరిగుట్ట, వేములవాడకు డీఈవో పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి మాత్రం అభ్యంతరాలు తెలుపుతూ శాంక్షన్ చేయలేదు. శాంక్షన్ అయిన రెండు ఆలయాలకు, రిజక్ట్ అయిన భద్రాద్రికి కారణం జీవో నం.888 కావడం గమనార్హం. దీంతో సర్కారు శాంక్షన్ఇచ్చినా ఎండోమెంట్కమిషనర్ఇప్పటివరకు ఆ రెండు ఆలయాలకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. పోస్టుల క్రియేషన్ పై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గారు. మరో వైపు సీనియార్టీ గోల తోడు కావడంతో యాదగిరిగుట్టలో ఓ ఎంప్లాయీ కోర్టును ఆశ్రయించాడు. తన లెక్క తేల్చకుండా డీఈవో పోస్టు భర్తీ చేయొద్దంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు.
ఒక్కో గుడిలో రెండేసి పోస్టులు
మూడేండ్లుగా ఏటా రూ. 25 లక్షలకు పైగా ఆదాయం వచ్చిన గుడులకు 6ఏ గ్రేడ్ ఇస్తారు. జీవో నంబరు 888 ప్రకారమే 6ఏ టెంపుల్స్ లో పోస్టులు ఏఈవో(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) నుంచి కిందిస్థాయి స్టాఫ్వరకు నియామకాలు, బదిలీలు జరపాలి. యాదగిరిగుట్ట, వేములవాడలకు రెండేసి డీఈవో పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్చేసింది. డీఈవో, అసిస్టెంట్స్థపతిని నియమించుకోవాలని అందులో పేర్కొన్నారు. వారికి జీతభత్యాలన్నీ ఆయా ఆలయాల బడ్జెట్ నుంచే తీసుకోవాలని సూచించారు. కానీ భద్రాద్రి ఆలయం విషయంలో మాత్రం ఈ జీవో ప్రకారం కుదరదు అంటూ పేర్కొనడం వివాదంగా మారింది. ఈ జీవో మార్చకుండా ఇతర పోస్టులు క్రియేట్చేయడం కుదరదు. దీంతో ఎండోమెంట్ కమిషనర్ యాదగిరిగుట్ట, వేములవాడకు ఈ పోస్టులు శాంక్షన్ అయినా జీవో రిలీజ్ చేయడం లేదని ఎండోమెంట్వర్గాలు పేర్కొంటున్నాయి.
యాదాద్రిలో పేచీ
ఇదిలా ఉంటే యాదాద్రిలో డీఈవో పోస్టు భర్తీ విషయంలో పేచీ నడుస్తోంది. అక్కడ ఐదుగురు ఏఈవోలు ఉన్నారు. ఒకరికే డీఈవో అయ్యే చాన్స్ ఉంది. సీనియర్టీ ప్రకారం తనకే ఆ పోస్టు రావాలంటూ ఓ ఎంప్లాయీ కోర్టును ఆశ్రయించారు. గతంలో ఈయన సస్పెండ్అయ్యారు. తర్వాత క్లీన్చిట్ తెచ్చుకున్నారు. సస్పెన్షన్ కాలం నాటి బెనిఫిట్స్ మొత్తం తీసుకున్నపుడు సీనియార్టీ కూడా వర్తిస్తుంది కదా.. అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీపై తేల్చకుండా భర్తీ చేయడానికి వీల్లేందంటూ ఆయన కోర్టు ద్వారా ఆర్డరు తెచ్చుకున్నారు.
అవసరం ఏముంది?
6ఏ టెంపుల్స్‌లో డీఈవో పోస్టు అవసరం ఇప్పుడు ఏముందంటూ ఆయా దేవస్థానాల ఎంప్లాయీస్ ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టు తమ ప్రమోషన్లకు తీవ్ర ఆటంకమని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఏఈవో పోస్టు వరకు జీవో నంబరు 888 ప్రకారం ఆయా దేవస్థానాలే నెలనెలా జీతభత్యాలు చెల్లిస్తుంటాయి. ఆ త ర్వాత సీనియార్టీ ప్రకారం ఏఈవో నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ఎండోమెంట్స్ కు ప్రమోషన్‌పై వెళ్తారు. తర్వాత గవర్నమెంట్ ద్వారా గెజిటెడ్ ఆఫీసర్ హోదా వస్తుంది. గతంలో భద్రాచలంలో పనిచేసిన వి.రామ కృష్ణంరాజు ఇలాగే ఏఈవోగా చేసి తర్వా త అసిస్టెంట్, డిప్యూటీ కమిషనర్ స్థాయికి వెళ్లారు. తర్వాత సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవోగా వచ్చారు. ఇప్పుడు క్రియేట్ చేసిన డీఈవో పోస్టు వల్ల ఇక టెంపుల్ సర్వీసులోనే రిటైర్ అవ్వాల్సి వస్తుంది. అసలు ఎంప్లా యీస్ అభిప్రాయ సేకరణ లేకుండా, 888 జీవో సవరించకుండా డీఈవో పోస్టు ఎలా క్రియేట్ చేశారని వారు నిలదీస్తు న్నారు. పోస్టు గెజిటెడా.. లేక నాన్గెజి టెడా.. స్కేల్పరిస్థితి తేల్చకుండా ఎలా చేశారంటున్నారు. గతంలో టీటీడీలో మాత్రమే ఈ పోస్టు ఉండేదని, అటానమస్ కాబట్టి అక్కడ ఆ పోస్టు సరిపోతుందని, కానీ ఇక్కడ తమ ప్రమోషన్లకు ఆటంకం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.