ఇసుజు మోటార్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో బుధవారం లక్షవ వాహనాన్ని ఉత్పత్తి చేసింది. ఇసుజు మోటార్స్ ఇండియా తన కార్యకలాపాలను 2016లో ప్రారంభించింది. చిత్తూరులోని శ్రీ సిటీలో తన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. 2020లో తన ఫేజ్–2ను మొదలుపెట్టింది.
అప్పటి నుంచి ఇక్కడ ఏటా భారీగా వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపింది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ కారణంగా ఇంజన్ల ఉత్పత్తిని గత రెండు సంవత్సరాలలో రెట్టింపు చేశామని ఇసుజు పేర్కొంది.