గాజాలోని ఆసుపత్రిపై అత్యంత ఘోరమైన దాడి తర్వాత టెల్ అవీవ్‌లో అడుగుపెట్టిన యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రమాదంలో దాదాపు 500 మందిని చంపిన వైమానిక దాడికి వేరే గుంపు కారణమని ఆరోపించారు. ఆయన ఈ దాడికి హమాస్ కారణమని డైరెక్టుగా చెప్పనప్పటికీ.. ఆయన తీవ్రవాద సంస్థపై ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ : దేశం దివాళా తీసిందా..? : పెట్రోల్ లేదని విమానాలు నిలిపివేసిన పాకిస్తాన్
"గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిలో జరిగిన పేలుడుకు ఇజ్రాయెల్ కాదు గాజాలో టెర్రర్ గ్రూపుల వల్ల సంభవించినట్లు కనిపిస్తోంది" అని బైడెన్ అన్నారు. "నిన్న గాజాలోని ఆసుపత్రిలో పేలుడు జరిగినందుకు నేను చాలా బాధపడ్డాను, ఆగ్రహానికి గురయ్యాను. ఇదంతా చూస్తుంటే ఇది మీ పని కాదు.. వేరే గ్రూపు పనే అన్నట్టు కనిపిస్తుంది" అని అమెరికా అధ్యక్షుడు నెతన్యాహుతో అన్నారు.