కాంగ్రెస్​ స్థలానికి అక్రమ రిజస్ట్రేషన్

కాంగ్రెస్​ స్థలానికి అక్రమ రిజస్ట్రేషన్
  • ఫేక్​ పేపర్లు సృష్టించి జాగా కాజేసేందుకు కుట్ర
  • పార్టీ లీడర్ల ఫిర్యాదుతో  డాక్యుమెంట్​ క్యాన్సిల్​ డ్రామా 
  • సబ్​ రిజిస్ట్రార్​ బదరున్నీసాకు నోటీస్​

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ నగరంలో ఖరీదైన కాంగ్రెస్​ పార్టీ స్థలాన్ని ఓ వ్యక్తి తన  పేరిట అక్రమ రిజిస్ట్రేషన్​ చేయించుకున్న విషయం బయటపడింది. దీంతో ఆ స్థలం    రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సీక్రెట్​గా క్యాన్సిల్​ చేసిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది.  రూ.50 లక్షలు విలువ చేసే 75 గజాల స్థలాన్ని మహ్మద్​ మాజీద్​కు రిజిస్ట్రేషన్​ చేసిన సబ్​ రిజిస్ట్రార్​ బదరున్నీసాకు డిస్ట్రిక్​ రిజిస్ట్రార్​ ప్రసూన బుధవారం సంజాయిషీ నోటీసు పంపారు. క్యాన్సిల్​ చేసిన రిజిస్ట్రేషన్​ విధానం చట్టబద్ధంగా లేదని తమకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. 

నిబంధనలు బేఖాతరు  ​

నగరంలోని శంభుని గుడి వెనక హైమదీ బజార్​ ఏరియాలో డీసీసీకి ఖరీదైన ల్యాండ్​ ఉంది. నాలుగు టెంపరరీ షెడ్​లు కట్టి వివిధ షాపులకు అద్దెకు  ఇచ్చారు. అందులో టీ షాప్​ ఉన్న 75 గజాల ల్యాండ్​ను  మే నెల 6న రిజ్వానా బేగం అనే మహిళ మహ్మద్​ మాజీద్​కు అమ్మినట్లు రిజిస్ట్రేషన్​ చేశారు. కమర్షియల్​ ప్రాపర్టీని రిజస్ట్రేషన్​ చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను పట్టించుకోలేదు. స్థలాన్ని అమ్మినమ మహిళ డాక్యుమెంట్లు చూపిందన్న వివరాలు లేవు. ఫేక్​ పేపర్లను పెట్టి నిందితులు సీక్రెట్​గా రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారు.

కాంగ్రెస్​ పార్టీ లీడర్లకు నాలుగు రోజుల కింద ఈ విషయం తెలియడంతో షాక్ కు గురయ్యారు. నగర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్​ కేశవేణు రిజిస్ట్రేషన్​ శాఖ డీఐజీ రమేశ్​రెడ్డికి ఫిర్యాదు చేయడంతో విషయంపూర్తిగా బయటపడింది. డీఐజీ ఆదేశాలతో 75 గజాల రిజిస్ర్టేషన్​ డాక్యుమెంట్​ నంబర్ 4175/24ను క్యాన్సిల్​ చేశారు. అయితే రిజిస్టర్డ్​ డాక్యుమెంట్​ క్యాన్సిల్​ చేయడానికి  ప్రత్యేక విధానాలు ఉంటాయి. గవర్నమెంట్​ గెజిట్​లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్​ను కలెక్టర్​ నామినేట్​ చేసే ఆఫీసర్​ వెళ్లి క్యాన్సిల్​ చేస్తారు. క్యాన్సిల్​ డాక్యుమెంట్​ సెపరేట్​గా ఉంటుంది.

ప్రైవేట్​ ఆస్తుల రిజిస్ట్రేషన్​ను అమ్మిన వారే క్యాన్సిల్​ చేసుకోవాలి.  ఫైనల్​గా రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్​ పవర్స్​కోర్టుకు మాత్రమే ఉంటాయి. ఇవేమీ కూడా కాంగ్రెస్​ పార్టీ ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ ​డాక్యుమెంట్​ క్యాన్సిల్​ విషయంలో జరగలేదు.  క్యాన్సలేషన్​ను  చేసినా విధానాన్ని టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ గడుగు గంగాధర్​  కూడా తప్పుపడుతున్నారు. భవిష్యత్తులోఇబ్బందులు వచ్చే అవకాశంఉందంటున్నారు. 

గిఫ్ట్​ ఇచ్చారని నమ్మించారు


లంచం తీసుకొని కాంగ్రెస్​ పార్టీ స్థలాన్ని మహ్మద్​ మాజీద్​కు రిజిస్ట్రేషన్​ చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం.  కాంగ్రెస్​ పార్టీ గిఫ్ట్​గా ఇచ్చినట్లు పేపర్లు చూపడంతో నమ్మి రిజిస్ట్రేషన్​ చేశాను. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశాను.
- సబ్​ రిజిస్ట్రార్​ బదరున్నీసా


సంజాయిషీ తర్వాత యాక్షన్​


డీసీసీ ల్యాండ్‌‌‌‌‌‌‌‌​ అక్రమ రిజిస్ట్రేషన్​ విషయంలో సబ్​రిజిస్ట్రార్​ బదరున్నీసాను సంజాయిషీ కోరాం. ఆమె ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెపై యాక్షన్ తీసుకుంటాం.
- డిస్ట్రిక్​ రిజిస్ట్రార్​ ప్రసూన