రెవెన్యూ గైడెన్స్ పెంచిన ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రెవెన్యూ గైడెన్స్ పెంచిన ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:ఐటీ కంపెనీ  ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తన రెవెన్యూ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచింది.  2024–25 లో రెవెన్యూ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3–4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  1–3 శాతం గ్రోత్ ఉంటుందని రెవెన్యూ గైడెన్స్ ఇచ్చింది. ఇన్ఫోసిస్  రెవెన్యూ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచిందంటే క్లయింట్లు ఖర్చు చేయ డానికి భయపడడం లేదనే విషయం అర్థమవుతోంది. 

 కంపెనీ నెట్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ( క్యూ1)  రూ.6,368 కోట్లకు పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన  ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  7.1 శాతం గ్రోత్ నమోదు చేసింది. రెవెన్యూ 3.6 శాతం పెరిగి రూ.39,315 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ నెట్ ప్రాఫిట్  20.3 శాతం, రెవెన్యూ 3.7 శాతం వృద్ధి చెందాయి. 

2024–25 ఆర్థిక సంవత్సరాన్ని స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మొదలు పెట్టామని, అన్ని సెగ్మెంట్లలో గ్రోత్ నమోదు చేశామని  ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు. ఆపరేటింగ్ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగిందని, పెద్ద డీల్స్ దక్కించుకున్నామని, ఎప్పుడూ లేనంతగా క్యాష్ జనరేట్ చేయగలిగామని వివరించారు. క్లయింట్ల నమ్మకానికి, తమ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఇది నిదర్శనమని అన్నారు. 

జనరేటివ్ ఏఐతో క్లయింట్ల అవసరాలను తీర్చడంపై  ఫోకస్ పెట్టామని చెప్పారు. ఇన్ఫోసిస్ షేర్లు గురువారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.20 శాతం పెరిగి రూ.1,764 వద్ద ముగిశాయి.
 

మరిన్ని వార్తలు