నైరోబి: ఆర్థిక సవాళ్లు, అధిక వడ్డీ రేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో వేగవంతమైన పురోగతి వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో లే ఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. కరోనా, ఇతర కారణాలతో ప్రముఖ ఐటీ కంపెనీల్లో 2023లో మొదలైన ఉద్యోగుల ప్రక్రియ నిరంతరాయంగా కంటిన్యూ అవుతోంది. 2024 ప్రారంభం నుండి ప్రపంచవ్యాప్తంగా 194 కంటే ఎక్కువ టెక్ కంపెనీలలో మొత్తం 211,033 మంది ఉద్యోగులు తొలగించబడ్డారని పలు నివేదికలు పేర్కొన్నాయి. గూగుల్, మెక్రోసాఫ్ట్, ఇంటెల్, టెస్లా, లి ఆటో వంటి అగ్రశేణిలు కంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపేశాయి.
ఖర్చు తగ్గింపు చర్యలు, ఏఐ సాంకేతికత వైపు మళ్లడం వంటి వాటిని లే ఆఫ్లకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లే ఆఫ్‌లు ప్రకటించిన టాప్ 20 దేశాల జాబితాను ఐటీ జాబ్ పోర్టల్ ‘ట్రూప్ఆప్.ఐవో’ విడుదల చేసింది. ఇందులో అమెరికా టాప్‌లో ఉండగా.. పోర్చుగల్ 20 స్థానంలో ఉంది. ఉద్యోగుల తొలగింపు జాబితాలో ఇండియా ఆరవ స్థానంలో ఉంది. అత్యధిక సంఖ్యలో ఎంప్లాయిలను తొలగించిన టాప్ 20 దేశాల జాబితాలో కెన్యా మాత్రమే ఆఫ్రికన్ దేశం ఉండటం గమనార్హం.
Also Read:-ఎగుమతులు భారీగా పడిపోయి.. దిగుమతులు పెరిగి..
ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ కోపియా కెన్యాలో జూలై 2023లో 350 మంది ఉద్యోగులను తొలగించడం ద్వారా కెన్యా జాబితాలోకెక్కింది. తద్వారా కెన్యాలో ఉద్యోగ సంక్షోభం తలెత్తిందని నివేదిక పేర్కొంది. ఇక, ఉద్యోగుల తొలగింపును కంపెనీల పరంగా చూస్తే.. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ డెల్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు డెల్ మొత్తం 18,500 మంది ఉద్యోగాలను ఇంటికి పంపించింది. ఇండియాకు చెందిన పేటీఎం 5వేల మంది ఉద్యోగులను తొలగించి.. ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది.