కొమురవెల్లి మల్లన్న గుడికి ఐటీ నోటీసులు 

కొమురవెల్లి మల్లన్న గుడికి ఐటీ నోటీసులు 
  • రూ.12 కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఐటీ డిపార్ట్ మెంట్ 

సిద్దిపేట, వెలుగు: రూ.12 కోట్ల ఆదాయ పన్ను బకాయిలు చెల్లించాలంటూ సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు జారీ చేసింది. నిజానికి ఆలయాలకు వచ్చే ఆదాయానికి ఐటీ చట్టంలోని 12ఏ సెక్షన్​ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ మల్లన్న ఆలయ​అధికారులు ఇప్పటివరకు ఈ సెక్షన్ కింద రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.

1995 నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు ఆలయానికి సంబంధించిన డిపాజిట్లు, టెండర్లు,  ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10 కోట్ల నిధులకు సంబంధించి రికార్డులు సరిగా మెయింటెయిన్ చేయలేదని ఆలయ అధికారులపై ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించే రూ.8.50 కోట్ల ఆదాయపన్నుతో పాటు రూ.3.50 కోట్ల ఫైన్ తో కలుపుకుని మొత్తం రూ.12 కోట్లు చెల్లించాలని కొద్ది రోజుల కిందనే ఐటీ శాఖ  నోటీసులు జారీ చేసింది.