కూకట్పల్లి, వెలుగు: గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్‌బీ పరిధిలోని వసంతనగర్ కాలనీకి చెందిన భరత్రమేశ్ బాబు అనే వ్యక్తి ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎక్కువ డబ్బులు సంపాదించాలని గంజాయి దందా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఖమ్మంకు చెందిన సంతోష్అతడికి గంజాయి తెచ్చి ఇస్తున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి వచ్చిన సంతోష్వసంతనగర్బస్టాప్లో గంజాయిని రమేశ్‌బాబుకి ఇచ్చాడు. అప్పటికే అక్కడ నిఘా పెట్టిన ఎస్టీఎఫ్ అధికారులు రమేశ్‌బాబుని అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ తప్పించుకుని పరారయ్యాడు. నిందితుడి నుంచి 1.1 కిలోల గంజాయి, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.